నీ చెక్కిళ్ళను నా దోసిటితో అందుకొని..
ముడుచుకుని చిరునవ్వులు చిందిచే నీ పెదవులను దాటి..
సిగ్గులొలికే నీ కలువకన్నుల పైన.. వున్న నీ నుదుటిపై
ముద్దాడుతూ...
నేను పడుతున్న వేదనంత ఆనందం నీతో ఎల్లపుడూ వుండలని...
నా అలోచనలలో నీవు వున్నట్లుగా.. సిరిసంపదలు నీతో వుండాలని...
నాకు లేని ఆయుష్యు, ఆరోగ్యం ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని కోరుకుంటూ...
కలలు కన్న నా కనులకేం తెలుసు.. కన్నీరు కార్చడం తప్ప..
నీపై మనసుపడ్డ నా హ్రుదయానికేం తెలుసు.. నిను ప్రేమించడం తప్ప