నా కలలో  నువ్వే. నా కళ్ళలో  నువ్వే. 
నా కన్నీళ్ళలో  నువ్వే.. 
నా కవిత లోను నువ్వే నా శ్వాసనిస్వసలలో నువ్వే 
నా ఆశ లో నువ్వే నా ఆయువు లో నువ్వే 
నా ఆత్మ లోను నువ్వే..నా నిన్న నువ్వే నా నేడు నువ్వే 
నా రేపు నువ్వే నా వేదన నువ్వే..నా  వేదం నువ్వే.. 
నా ఆది నువ్వే.. నా అంతం నువ్వే ..
నువ్వే.. నువ్వే.. నువ్వే ..నేను అనేది మరిచినా నాకు ..
సమస్తం నువ్వే ..నా ప్రాణం నీ పాదాలకే అంకితం ..
నా ఆయువు దీపం నాకు నేను గ అర్పుకోవటానికి.. 
నీ చివరి చూపుకై నా ఈ ఎదురు చూపు.. 
ఓ సారి కనిపిస్తే నీ రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని,  
మరు జన్మకు కరునిస్తవనే  కాంక్ష  తో కళ్ళు మూస్తాను
 
