ఎంత కాలమెంత కాలం....
వెల్లువెత్తే జ్ఞాపకాలతో కదిలిపోతూ,
కలవరిస్తూ, తల్లడిల్లుతూ, గతం గుర్తుకొస్తుంటే
మాయలు చేయలేక...మనసును చంపుకోలేక
నిజాన్ని దాచుకోలేక గతాన్ని మర్చిపోలేక..
నమ్మకాల మీద ప్రమను సమాదిచేసిన వాళ్ళను చూస్తూ
ఎందికిలా అంటూ వెర్రివాడిలా ..నమ్మలేని నిజాల్ని చూస్తూ
అలమటిస్తూ బాధ మనసును కోతకోస్తూ
కన్నీటి సుడులలో మునిగితేల్తూ కుమిలిపోతూ,
ఖిన్నమవుతూ బరువు బ్రతుకును భరిస్తూ
దహించు గురుతులు సహిస్తూ
నిలుచున్నపాటున నీరైపోతూ నివురైపోయే
క్షణాలకోసం తపిస్తూ
నిలువలేనీయని మనసుతో ప్రతీక్షిస్తూ
నిలపలేని కనుల బరువుతో నిరీక్షిస్తూ ఎంతకాలమెంతకాలం....
ఇంకెంత కాలమెంతెంతకాలం........