కురిసే ప్రతి బిందువు స్వాతి ముత్యము కాలేదు
విరిసే ప్రతి పువ్వు పరిమళ్ళన్నివేద జల్లలేదు
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు
కనిపించే ప్రతి మనిషి స్నేహితులు కాలేరు
అందుకే భయపడుతుంది నా మనసు
ఎవరితో చేయాలి స్నేహం అని
అంతలోనే ఎడారిలో దొరికిన నీటి బుగ్గలా మనం కలిసాము
ఎవ్వరూ విడతీయలేనంత ఘాడంగా మనం స్నేహితులం అయ్యాము
మనస్నేహం కలిసింది..నా జీవితంలో పూలవర్షం కురిసినంత హాయిగా
భావాలు కలిసాయి..భాదలు పంచుకున్నాం
ప్రతిక్షనం ఒకరికొరు గుర్తుకుతెచ్చుకుంటూ..
మనిద్దరమే లోకం అయ్యాము.ప్రపంచాన్ని మర్చిపోయాం..
స్వచ్చమైన స్నేహానికి ప్రతినిదులుగా..
నీతలపే నాది నాతలపే నీదైంది..
నీ ఊహలకి బాటలు వేద్దాం అనుకున్నా..
ఆశ ఆశగానే మిగిలి పోయింది..
నే నడిచిన బాటలో విరిసిన కుసుమ మైంది నీ స్నేహం...
నే వదిలిన శ్వాసలోని భావం నీ స్నేహం...
నీ అడుగుల శబ్దం నా గుండె వేగం పెంచేది మర్చిపోలేని నీ స్నేహం....
చిత్తడి వానలో జడి వాన లో తడిస్తే కలిగే పులకరింపు నీ స్నేహం....
నే దేవుడిని కోరే ఒకే కోరిక నీ స్నేహం....మరు జన్నలోకూడా
మన స్నేహం కలకాలం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జీవించా.
కోరిక కోరిక గానే మిగిలిపోయింది..మురిపించిన ఆస్నేహం భాదను మిగిల్చింది..తప్పంతా నాదే
ఎన్ని జరిగినా ఎమైనా నీ స్నేహాన్ని కలకాలం మదిలో పదిలంగా గుర్తుంచుకుంటా నేస్తం..ఎప్పటికీ