మ్రోగిన గుండె చప్పుడే నాదైనా
పెళ పెళ ఉరుముల మెరుపుల్లో నే
కలిసి పోక వినిపింతునా .?కనిపెట్టినా
కరుడు గట్టిన మబ్బుల్లో చినుకులే
కొలువు తీరేనేమో మనసులో
గజి బిజి రాతల విధి చేతిలో
గమనము మరచిన జన్మమునై
గతించిన కాలమే నీదని
నీ చేతిలో ఓడి చితికి పోయాను ప్రియా..
ఇంక గెలవలేను అని తెల్సింది..గెలవనీయవని తెల్సింది
మన మంచి కోరే వాళ్ళు పదికాకాల పాటు సుకంగా ఉండూ అంటారు.
కాని నీవు నీజ్ఞాపకాలతో చచ్చేవరకు భాదపడూ అని శపించావుకదా
ఎందుకిలా చేసావని అడుగలేను..చేస్తున్నావని అడుగలేను ..
నాకు నీవిషయంలో ఏలాంటీ అర్హత లేదని తేల్చిన క్షనంలోనే చచ్చిపోయాణు
చీకటి వెలుగుల చుట్టరికంనే రాతిరి గుండెలో విచ్చిన పుష్పం
వేకువ జాడలే నా ఆఖరి చిహ్నం వెతికినా దొరకను వెలుతురు నీడలో
పిలిచిన యుద్ధం నాదే గెలిచిన గర్వం నాదే ఓటమి నీడ నాదే
కురిసిన కన్నీటి వర్షం నేనే తడిసిన క్షేత్రం నాదే.. మిగిలిన తపనను నేనే