ఆ కళ్ళు మోసం చేశాయి... ఆ గొంతు.నాగొంతును నొక్కేసింది..
ఆ కళ్ళను చూసి మోసపోయాను ..ఆ చూపులు నిజం అని నమ్మా..?
ఆ చూపుల్లో మెరుపులు నా సొంత అనుకున్నా..కాని..?
ఆ గొంతు పలికే ప్రతి పదం నిజం అని నమ్మా..?
తాను పలికే ప్రతి మాట నాస్వంతం అనుకున్నా..కాని
ఇలా మాట మారుస్తుందన్ని .... అస్సలు ఊహించలేదు
ఇలా చూపు తిప్పుకుంటుంది అని అస్సలు అనుకోలేదు
మాటల్లో ఇంతా మార్పులొస్తాయని ...కళ్ళోకూడా అనుకోలేదు
అవే మాటలు ..అవే చూపులు అప్పుడు నా సమక్షంలో మరి ఇప్పుడు ..?
అప్పుడలా ...ఇప్పుడిలా ...ఎందుకలా...?
నీకిది న్యాయం అనిపించే చేస్తున్నావా.. మరి అప్పుడు నాతో అన్నవన్నీ
అబద్దాలా ...ఇప్పుడు చేస్తున్నది..అదీ నాకు తెల్సేట్టుగా ..?
ఊబిలో కూరుక పోతున్నావని గుర్తించలేక పోతున్నావు....?
అయినా చెప్పినా వినే స్థితిలో లేవు..మొసం చేసిన వాళ్ళకు ఏమీ గుర్తుండవు
గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు..అంత తీరిక వాళ్లకు ఉండదు