నువ్వు ఎక్కడున్నా పట్టేస్తాయి
నీకు తెలియకుండానే వెంటాడుతాయి
గతపు జ్ఞాపకాలతో తోడేస్తాయి
కోటి కోరికలు రేపుతాయి
దారి కోసం వెదుకుతూ ఉంటే
సముద్రంలో దిక్సూచిలాగా వెలుగు పంచుతాయి
అవి అందమైన ప్రపంచాన్ని చూస్తాయి
చూసేలా చేస్తాయి
కానీ తనను నిరంతరం కాపాడే కను రెప్పలను తప్పా ..
కనుపాపలను తప్పా ..
కళ్ళే కదూ ..అవును ..నిజంగా కమ్మని కళ్ళే ..
అవి గుండెకు వాకిళ్ళు..
హృదయానికి రెక్కలు ..
మనసుకు పొదరిల్లు ...
కళ్ళను చదివితే లోకాన్ని గుప్పిట బిగించినట్టు
కళ్ళలోకి చూస్తే ..ఇక ఏమీ లేనట్టు అనిపిస్తుంది
అంతా అయిపోయాక ..అద్భుతంగా తోస్తుంది .."