. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 24, 2012

పొద్దువాలేలోపు గాయపడట౦...రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦

రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..
ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦

సన్నివేశ పునరావృత పర౦పరలో
గొ౦తెత్తి ప్రశ్ని౦చే స౦దర్భము౦డదు
ఎదురుచూపుల నమ్మక౦పై
ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి

మౌనంగా చూస్తూ...గతం గెలుకుతోంది గాయాన్ని
మనసు మూగగా రోదిస్తూ...నన్ను వేదిస్తూనే ఉంది

విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦
ఉదయాలు గాయపడకు౦డా అడ్డుకోలేవు
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు

ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి
మళ్ళీ పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..