.నిన్ను చూసినప్పుడల్లా
మళ్ళీ ..మళ్ళీ జన్మించాలనిపిస్తుంది
గుండెల్లో నాలో కోటి ఆశలకు
ప్రతిబింబమై చుంబించే నీ రూపాన్ని
కలకాలం దాచుకోవాలని అనిపిస్తుంది
నువ్వు వస్తూ ఉంటే..వాలు చూపులోనే సేదదీరి
జ్ఞాపకాల కలల కౌగిలో తేలిపోయి
నీతో కలిసి ప్రపంచమైన ప్రేమ కోసం
ప్రయాణం చేయాలనీ ఉంది
అవును ...ఎప్పుడూ లేని కదలికలు ఇప్పుడెందుకో
దీనిని ఏమనాలి ?
నువ్వంటే నేనేనని అనుకోవాలా
లేక నువ్వు నిజమంటూ ఉండిపోవాలా .."