నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు, తర్కాలు అన్వేషించనారంభిస్తే మనలో మానవత ఎంత అడుగంటిపోయినట్లు..?
“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.
నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం...ఒకప్పుడు అలాపలికిన పెదాలే..ఇప్పుడు ఘోరమైన పదాలు పలికేందుకు సైతం వెనుకాడటంలేదు..కారనం ఎదైనకావచ్చు కనీసం అర్దం చేసుకోలేని మనస్సు లేనప్పుడు ఆ పదాలు పలికే అర్హత కోల్పోతారు మనం నుంచి నేను అనే స్వార్దం..నీలో ప్రవేశించినప్పుడు...ఎదుటి వాడు భాదపడతాడు అని తెల్సినప్పుడు కూడా స్వార్దంతో నీవు పలికే ప్రతీక్షరం ఎదుటి వాని .( ఒకప్పుడు నీకు ప్రత్యేక మైన స్నేహం ఇప్పుడు కాదన్న నీపెదాల్లో నిజాయితీ ఎప్పుడు పలుకుతావు )మనస్సు గాయపరస్తున్నాను అనీ అయినా నీవు ఆలోచించగలిగావా..?...నీ మనస్సాక్షిని ఒప్పించే చేస్తున్నావా.].? తెలీక చేస్తున్నావా తెలిసి చేస్తున్నావా ఎంత తలలు పగుల కొట్టుకున్నా అర్దకావడంలేదు మిత్రమా అంత తీరిక నీకెక్కడిదిలే..నీవరకు నీవు హేపీగా ఉంటే చాలుకదా అనే నీవు అలోచిస్తావు..నా చిన్నిమనస్సు కూడా నీవు హేపీగా ఉండాలనే కోరుకుంటుంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే చాలు అదెలాగూ నీవు చేయవులే...దేవుడంటే నమ్మని నీవు దేవుని గుడీ సాక్షిగా నీవు చెప్పిన ప్రేమ నిర్వచనం నాగుండేల్లో ఇప్పటికీ బాంబులా పేలుతూనే ఉంది...ప్రేమ అనే పదాన్ని అలా అంటా దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా అని...ఆ మాట నిజంగా ఎలా అనగలిగావు...నిన్ను ఇష్టపడ్డ నన్ను ఎదురుగా పెట్టుకొని నాకెవ్వరూ లేరు అంటు మరో వ్యక్తి పేరు చెబితే ఎదుటి మనస్సు ఎంత ఆందోళన పడుతుంది అని ఆలోచించావా...నీకు నేను లేనా అని నిలదీయాలని పించింది..అప్పటికే అనాల్సినవన్నీ అనేశావు సో అక్కడ నేను అనటానికి చెప్పుకోవడానికి ఏంలేదు అందుకే మౌనంగా ఆకాశంవైపు చూస్తూ ఉండిపోయా..అంతకు మించి ఏమీ చేయలేక..
అంత దగ్గరగా ఉన్నమనం ఇప్పుడు దూరం అయ్యాము మళ్ళీ దగ్గరగా కాలేనంతగా...కారనాలు ఎన్నైనా ఉండొచ్చు..ఒకసారి మనసులో ఇష్టపడ్డతరువాత అన్నిటినీ జయించాల ...ఎన్నోకష్టాలు వస్తాయి ఓర్చుకోవాలి...రాతల్లో ఎంతోదైర్యిం ఉన్నదానిలా రాస్తావు నీ రియల్ లైఫ్ లొ ఎందుకు పిరికిదానిలా ప్రవర్తిస్తున్నావో అర్దంకాదు...నీవు ఆలోచనలు కరెక్టని నేను గట్టిగా నమ్ముతా..కాని నీవు ఆలోచించడం లో మామూలు ఆడపిల్ల కంటే దారుణం భయపడుతున్నావని తెలుస్తోంది ...నీలో దైర్యాన్ని చూసే అదే నీ ప్రత్యేకత అని ఒకప్పుడు అనుకునేవాన్ని ఇప్పుడు..దానిలో నిజం లేదని అనిపిస్తోంది...నీఎదురుగా ఏడుస్తే అదినిజం అని నమ్ముతావా....నిన్ను బాగా ఇంప్రస్ చేసేలా మాట్లాడితే అదే నిజం అని నమ్ముతున్నావు...నాకవి చాతకాదు.. మనసులో నాకు నీమీద చెప్పుకోలేనంత ఇష్టం వుంది అది నీకు తెల్సు కాని...నీ ఎదురుగా నటించాలి అది నాకు చేతకాదు..అందుకే నేను దూరం అయ్యాను అనుకుంటున్నా...నాగురించి నీకు తెల్సినంతగా ఎవ్వరికీ తెలీ అలాంటి నీవు ఎవ్వరో నామీద చెబితే నమ్మి నామీదకే దాడికి వచ్చావు అనకూడని మాటలు అన్నావు అయినా నేను మౌనంగా పడ్డాను అన్నది నీవేకదా అని మనసును సర్ది చెప్పుకున్నా...ఒక్కసారి గుండెల మీద చేయివేసుకోని చెప్పు నేనేంటో నీకు తెలీదా ఎందుకలా చేశావని ఎన్నోసార్లు అడగాలనుకొని నీవు ఎక్కడ భాదపడతావని అడగ లేకపోయా..వాడి సంగతి తెల్సి నీవు వాడికి సపొర్టు చేసి ఎంత తప్పుచేశావో ఇప్పటికైన అర్దం అయిందో లేదో...నిన్ను ఇష్టపడ్డందుకు వాడు చేసిన దానికి నిన్ని రకాలుగా నేను బ్లైం అయ్యానో తెలుసా..ఎంత టార్చర్ అనుభవించానో నీకు తెలీదు..తెల్సి ఉండొచ్చు కాని తెలీనట్టు ఉంటున్నావో కూడా తెలీదు ...నేను నిన్ను ఇష్టపడి తప్పు చేశానా నీవు నన్ను ఇష్టపడీ తప్పు చేశావా అన్నది నాకు ఇప్పటికీ అర్దం కాదు...ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నప్పుడు స్నేహంగా ఉన్నప్పుడు..ప్రేమించుకున్నప్పుడు లేని రీజన్స్ ఇప్పుడెందుకొచ్చాయో అర్దంకావడంలేదు..అలా వస్తాయని కూడా తెలీదు..దూరం చేసుకోవడాని రీజన్స్ ను అడ్డూగోడలు గా పెట్టీ దూరాం అవుతున్నావని పిస్తోందొ
http://obulreddi.blogspot.com/ బ్లాగ్ స్పాట్ లోనిది