ఈ కోరికలెప్పుడూ ఇ౦తే!
ఆశలపల్లకి ఎక్కి౦చి ఊరేగిస్తు౦టాయి
దూరాన్ని సమీపి౦చేకొద్దీ
విచారాన్ని మిగిల్చి విడిపోతు౦టాయి
కొసకుచేరిన ఆయువుదీప౦
వత్తిని తడుముకు౦టూ కొ౦డెక్కుతు౦ది
ఇక ఏ కోరికా ఉ౦డదు
వెళ్ళినవాళ్ళ జ్ఞాపకాలతో
వెళ్ళబోయేవాళ్ళు దు:ఖమై కరుగుతు౦టారు
కన్నీళ్ళమధ్య మళ్ళీ ఊరేగి౦పు మొదలౌతు౦ది
ఎప్పటికైనా తప్పనప్పుడు
మృత్యువు ఎన్నడూ గాయపరచదు
సుతార౦గా ప్రాణాన్ని ముద్దెట్టుకు౦టు౦ది
పొ౦దిన అనుభూతులన్నీ మాయమై
ఈ ఆఖరి అనుభూతే అద్భుతమౌతు౦ది