Monday, October 31, 2011
నీ జ్ఞాపకాల కొలిమిలో నాహృదయం తగల బడుతోంది
నీ జ్ఞాపకాల కొలిమిలో నాహృదయం తగల బడుతోంది..
ఆవేడీని తట్టుకోలేని నా హృదయం ఆర్తనాదాలు చేస్తుంది.పెద్దగా..
ఆ ఆర్తనాదాలు నీకు చేరి నీవు వస్తావేమొ అని వెర్రిగా ఆలోచిస్తూ
ఆ ఆర్తనాదాలు నీకు వినిపిస్తున్నాయి నాకు తెలుసు కాని నీవు..?..
రాలేదు వస్తావన్న ఆశ చచ్చిపోయింది..నిరాసే మిగిలింది..
నేస్తామా అన్నపిలుపు మదిలో ఎప్పుడూ మెదలుతున్నావన్న మాటలు నిజంకాదా..?
అప్పుడన్నావు మదిలో ఎప్పుడూ మెదలు తావని అదో పెద్ద జోక్ కదా..?
అవును నిజమే కదా...ఒకప్పుడు నాజ్ఞాపకాలు మళ్ళేల పరిమలాలు..
ఎందుకో అవినీకు కుళ్ళీ కంపుడుతున్నాయి కదా..
అందుకేనేమో దూరంగా పడవేశావుకదూ నా జ్ఞాపకాలను..
ఎందుకో పిచ్చోడిలా ఇంకా నీకోసం తడుముకుంటున్నానేమో కదా..?
నిజమే నేను తీసుకున్న నిర్నం కరెక్టే..అదెప్పుడు జరుగుతుదోనని ఎదురు చూస్తున్నా..
నీజ్ఞాపకాల కొలిమిలో తగల బడుతున్న ఆర్తనాదాలు చేయాలన్న ఆలోచన విరమించుకున్నా
ఎందుకంటే ఆగిపోయే ఊపిరికి ఆశలు అవసరంలేదు..అది తగలబడనీ
పూర్తిగా కాలి బూడిదైనా నీకు ఏంకాదు కొంచెంకూడా భాద అనిపించదు నాకు తెల్సు
జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది..జరుగుతున్న ఘోరాలు ఇక చూడలేని వినలేను..
దగ్గరవుతున్న..మరణ మృదంగాలా శబ్దాలు ఇప్పుడు హాయిగా అనిపిస్తున్నాయి..
చివరి ఘటియలు లెక్కపెట్టుకోవడం అంటే ఇదేనేమోకదా...?
Labels:
కవితలు