విరహానిది ఒక తరహా ఒటమి...! -"నీ"
మాటకు మాటకు మధ్య
ఎన్ని మట్టికట్టలేసినా ఆగవు
మౌనం ఒక విఫలయత్నం..!
హ్రుదయానికి నీ హ్రుదయానికి మధ్య
దూరాలేవైనా కరిగిపోతాయ్
విరహం ఒకతరహా ఓటమి..!
నువ్వక్కడే నిలబడ్డచోట..
నేనిక్కడ కూలబడ్డాక..
ఒంటికి ఒంటరితనం అల్లుకున్నాక
ఒక ఇద్దరి మరణం
కొనసాగుతోంది అదేపనిగా...!
ఒక పాట కట్టుకోవాలి
అంతరాంతరాల్లో పాడుకొవాలి
మనిద్దరం ధ్వంసం అయ్యేదాకా..!
మాటకు మాటకు మధ్య
ఎన్ని మట్టికట్టలేసినా ఆగవు
మౌనం ఒక విఫలయత్నం..!
(చాలా కాలానికి) -"నీ"