Tuesday, October 18, 2011
ఇవి కన్నీటి మరకలు కావు... రక్తాక్షరాలు..నిఖార్సైన నిజాలు
ఇవి కన్నీటి మరకలు కావు రక్తాక్షరాలు..
అక్షరాలు రాసింది నీవు..కన్నీటి మరకలను గుర్తించావా..
నీకెందుకు తెలీదు అన్నీతెల్సు ..కాని తెలియనట్టు నటిస్తున్నావు..
నేనేంటో తెల్సి ఎందుకిలా చేశావు..నీవెందుకు ఇలా మారిపోయావు..
నీకు నీలైఫ్ ముఖ్యిం కదా..ఎదుటి వాడు ఏమైనా నీకెందుకు లే..
ఎవడన్నా తాడి గొడవచేస్తే అదేనమ్ముతావు ...ఎందుకంటే నీపరువు పోతుంది..
తాగి ఆఫీసుకు వస్తే ..ఇంటి వద్దకు వస్తే నీ పరువు ఫోతుంది..
అందుకే నీ పరువు కోసం వాడు చెప్పినవన్నీ నమ్మావు..?
అందుకే నీవు హేపీగా ఉండాలని చూసినందుకే ఇలా అయ్యాను అనికూడా నీకు తెల్సు..
వాడిలా తాగి యాగీ చేయడం నాకు తెలీదు..నీవు హేపీగా ఉండటానికి ఏమైనా చేయగలను ..
అందుకే మౌనంగా నేనిలా..నీకోసం ఎన్ని భరించానో బరిస్తున్నానో త్వరలొ గుర్తిస్తావు
వాడు తాగి గొడవ చేస్తే..నీ పరువు పోతుంది ఎదుటివాడి మనస్సు భాదపడ్డా నీకనవసరం కదా..
మనిషిని ఎప్పుడు అర్దచేసుకుంటారో కదా..? ఆ మంచి మనస్సు ఉంది కానీ...?
చెప్పేదైర్యం లేనప్పుడు పరిస్థితులను తట్టుకోలేనప్పుడు ఇష్టం అని చెప్పడం దేనికి..
అన్నీటికీ ఎదురించే నీకోసం ఎదురు చూస్తున్నా ... నీవిలా మారతావని కలలోకూడా ఊహించలేదు..
మాటల్లో చెప్పే దైర్యం చేతల్లో లేదెందుకు..రాతల్లో రాసే నిజాయితీ జీవితంలో లేదెందుకు..
నీకు జీవితంలో ఎదురించే దైర్యం లేదు..మాటల్లో చెప్పే సహనం నీకు లేదుకదా..?
ఎదుటి వాడు మనస్సు ఎంత భాదపడినా,గాయపడినా నీకు అవసరం ..నీవు హేపీగా ఉండాలి..
అందరూ నీదగ్గర నటిస్తున్నారని ఎప్పుడు తెల్సుకుంటావో తెలియడంలేదు..
కళ్ళలో కనిపించేవే కన్నీళ్ళూకాదు కొన్ని విషయాల్లొ గుండెళ్ళో మంటలు కళ్లలో రక్తం తెప్పిస్తుంది..
నీవు ఎందుకు మారావని అడుగను అప్పుడు ఎలా వున్నానో నీవంటే ఇష్టంగా ఇప్పుడూ అలాగే వున్నా ..
నేను మారను ప్రతిక్షనం నీవు గుర్తుకువస్తూనే ఉన్నావు ..నీవు నాగుండేల్లో ఉన్నావు ఎప్పటికీ ..
ఆనిజం నీకు తెల్సు కాని ...ఆనిజాన్ని మనసులో పెట్టుకొని అందరికీ బయపడుతూ ఓ హృదయాన్ని ఎంత భాదపెడుతున్నావో తెల్సా..
అయినా వద్దులే..నీవు ఎక్కడ వున్నా హేపీగా ఉండు ..అదే నేను చివరి వరకు కోరుకునేది
Labels:
కవితలు