ఇలా ఎలా ఉండగలుగుతారో కదా..?
ఎందుకో ఈ రోజు మనసంతా గందర గోళంగా ఉంది అన్నాకదా ..
అసలే పుండు లా మనస్సు ఉంటే కారం చల్లినట్టు అంటే ఇదే నేమో..
ఒకరి వల్ల దారునంగా దెబ్బతిన్న మనస్సు..కోలుకోలేకుడా ఉన్నా..
సమయం చేసిన దారుణానికి కోలుకోలేకుండా ఉన్న సమయం..
నీవు గతం లో తిరిగిన ప్రదేశంలో తిరగటం తప్ప ఏం నీ ఆలోచనల తో పిచ్చి పిచ్చిగా ఆలోచించడం తప్ప
అలా ఓ పార్కు లో కూర్చున్నా ..ఎక్కడ నుంచో లీలగా మాటలు వినిపిస్తున్నాయి..
వాడు పిచ్చి వాడురా నేనూ లాకపొతే బ్రతక లేడు..పాపం అని ఓ అమ్మాయి అంటుంది
తాను దూరం అయినప్పటినుంచి అన్నం సరిగ్గా తినలేక పోతున్నా అంటుంది
వాళ్ళేవరో తెలీదు చూడాలని ఉన్నా ఆ మాటలు గుండేల్లోకి దూసుకెలుతున్నాయి
వాన్ని వదలి ఉడలేనురా..వాడు ఎప్పుడు నాగురించే ఆలోచిస్తాడు అంటుంది
వాడేమైపోతాడో అని అంటుంది ఇలా కూడా ఆలోచిస్తారా ..అని నాకు ఆచ్చర్యిం వేసింది..
స్వార్దం తో ఏమైపోతాడో అని తెల్సినా తనసుఖం చూసుకెళ్ళిన మనుషులను చూశాను కాని ఇలా ఎలా ఉంటారో కదా..
గుండేల్లో గుచ్చేపా మాట్లాడుతున్నాం అని తెల్సినా తన సేఫ్ చూసుకున్న మనిషిని చూశా
ఆమనిషినిషికి తన పరువు ముఖ్యిం ఎదుటి వాని మనస్సు ఎమైనా అక్క్రలేదు మనస్సు మంచిదే కాని ఎందుకిలా మారిందో తెలీదు..
నేను ఎలా ఉన్నానో అని అడిగి కనుక్కునెంత తీరిక లేదు తనకు
నేను అప్పుడూ ఎంత ప్రేమగా ఉన్నానో ఇప్పుడూ అంతే ఉన్నా నేను మారలేదు తనెలా మారిందో తెలీదు..
తనకి తెల్సు తనగురించి ఎంతగా ఆలోచిస్తానో అని కాని..ఎందుకోఇలా..
ఎవ్వరో అంత ఇష్టంగా మాట్లాడుతుంటే నాకు గంతం తను ప్రేమగా మాట్లాడే ఆ గంతం గుర్తుకు వచ్చింది..
ఇంకేముంది కన్నీరు ఆగదు..బాధ తీరదు మరి చేయని తప్పుకు బలైనా తప్పదు అందుకే..?