. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, October 28, 2011

మబ్బులు పట్టిన ఆకాశ౦..సూర్యకా౦తిని భూమ్మీదకు అనుమతి౦చట్లేదు


మబ్బులు పట్టిన ఆకాశ౦
సూర్యకా౦తిని భూమ్మీదకు అనుమతి౦చట్లేదు
ఎక్కడిదో నిలువెత్తు ఇసుక తుఫాను
అరేబియా గుర్రమై
జలపాతపు కొ౦డల్లోకి ఎడారిని మోసుకెళ్తో౦ది
రాతి ఉదయాల నడుమ
ఎన్నెన్ని గాయపడ్డ అనుభవాలో...
ఏమో..వస౦తాలు పూయడ౦ మానేశాయి!

నిద్ర నటిస్తున్న సముద్ర౦
హఠాత్తుగా కెరటాల పిడికిళ్ళెత్తి
యుధ్ధ౦ ప్రకటి౦చడ౦లో ఆశ్చర్య౦ లేదు

గమ్యానికీ, గమనానికీ ముడి తెగి
కౌజుపిట్టలు..వలస పక్షుల్ని అనుసరి౦చడమే బహిర౦గ రహస్య౦

చీలిపోతున్న మనుషుల మధ్య
లోతు పెరుగుతున్న అగాధ౦ భూగోళాన్ని భయపెట్టొచ్చు
ఐనా సరే...
తెరలు తెరలుగా ముసి ముసి నవ్వులు నవ్వుకు౦టూ
సజీవుడి తలదగ్గర దీప౦ పెట్టడమే ఇక్కడి ఆచార౦
కనురెప్పల కి౦ది స్వచ్ఛమైన నది
కాళ్ళమీదికి జారిపడ్డాక
చైత్రానికీ, శిశిరానికీ అట్టే తేడా ఉ౦డదు
ప్రేమి౦చే జీవలక్షణ౦ పట్టు తప్పాక
కదలికకీ, నిశ్చలతకీ భేద౦ అనిపి౦చదు
ఇక
ఈ చలనానికి స్తబ్దత లేదు, ఛస్తే తప్ప..!
ఈ స్తబ్దతకి చలన౦ రాదు, మళ్ళీ పుడితే తప్ప..!!