Monday, October 3, 2011
గెలువలేనని నిర్ణయించుకున్నప్పుడు బ్రతకడం ..అనవసరం నీవిక మరణించు
ఒక్క నిమిషం ఆలోచించు
ఓడిపోతే మళ్ళి ప్రయత్నించు
మళ్ళి ఓడిపోతే మళ్ళి మళ్ళి ప్రయత్నించు
గెలువలేనని నిర్ణయించుకున్నప్పుడు బ్రతకడం
అనవసరం నీవిక మరణించు
ఓ బీరువు మరణం విశాల సృష్టికి వెలితి కాబోదు
నీ ఆర్దాంతర అస్తమయం ఎ వీరుడి పుణ్య చరితకు మచ్చ కాబోదు
కాల ప్రవాహంలో అనాధ శవంలా కొట్టుకు పోతున్న నిన్ను చరిత్ర గుర్తించజాలదు
మరణమే శరణ్యం అనుకున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు
ఆ ఆలోచనను మరొక్క నిమిషం కొనసాగించు
చావడానికి కావలసిన ధైర్యంలో వందవ వంతున్న ఏదో సాదిస్తావ్
ప్రతి ఓటమి ఒక అనుభవమేనని తెలుసుకో
ప్రతి అనుభవాన్ని గుణపాఠంలా మలచుకో
అప్పుడు ఈ అనుభవాలే నీ విజయానికి సోపానాలవుతాయి
ఆ గుణపాటాలే నీ కీర్తిని ఆకాశమెత్తుకు చేర్చుతాయి..
అప్పటికీ నీకు గమ్యిం దొరక్కపో తే చచ్చిపో ...సమయాన్ని వృదాచేయకు..
Labels:
కవితలు