Saturday, October 8, 2011
నాహృదయంతో " బుల్ ఫైట్ గేం " ఆడావుకదా...?
నా హృదయంతో " బుల్ ఫైట్ గేం " ఆడావుకదా...?
బుల్ ఫైట్ కోసం వాడే బుల్స్ కు కూడా మొదట చాలా ప్రేమగా చూస్తారు..
చాలా ప్రేమగా పెంచుతారు..తట్టుకోలేనంతగా
పాపం అదికూడా యజమాని పెంచేదే ప్రేమతో అని నమ్ముతుంది
ఫైటింగ్ ప్లేస్ కు వచ్చేదాకా అసలు విషయం తెలీదు
వీపుల్లో ..కత్తులు దిగేదాకా ..తనపైదాడి జరుగుతుందని
నీవుకుడా చాలా ప్రేమగా మాట్లాడావు ప్రేమగా చూశావు నన్ను..
ఫైటింగ్ ప్లేస్ కు వచ్చేదాకా అసలు విషయం తెలీదు
ఒక్కసారి తన యజమాని వైపు చూస్తుంది జాలిగా.
చివరకు తను ప్రేమించే యజమానికోసం ప్రాణానికి తెగిస్తుంది..
నీవు మాటల్తో , మరొకరి చేత దారుణంగా..భాదపెట్టావుఅన్నీ తెల్సి కూడా..
అక్కడ షార్పుకత్తులతోదాడి...ఇక్కడ మాటల్తో తేడా ఏం లేది భాద ఒక్కటే..
మనుషులతో మనసుతో కత్తులతో దాడి చేయల్సిన పనిలేదు
మాటలో చేతలతో మనిషిని దారుణంగా భాదపెడతారని తెల్సింది..
బుల్ ఫైట్ లో కూడా ఇలాగే యజమానిని నమ్మితే..
మరొకరిచే కత్తులతో దాడి చెయించాడూ యజమాణి నిలాగే కదా..
అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుందా జరిగిన సంఘటనలన్నీ..
Labels:
జరిగిన కధలు