బరువెక్కిన గుండె బదులు పలుకమని అడిగే
మాట రాని మౌనం మనసుని అడిగె మరణం
లోకమెరుగని పసితనం పలికిందా నిరంతరం
కాని నాడు కాచునని కరుణార్ద్ర హృదయం
నేర్పమని విద్య నిన్నే అడిగిందా మిధ్య
కథలో కాదు రణం కత్తిలో కలదను నిజం
తెలిసే సరికే నీకు గురుతువైనావా గురికి
రాజ్యమే లేదే నీకు రణము చేతువా గెలుపునకు
నిర్ణయమేదో నిజమునకు నిశ్యయమేదో దైవమునకు ..?