. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, October 27, 2011

ఈ ఉదయ౦ ఏ వెలుగునూ మోసుకురాదేమో..?..ఎప్పటిలానే నిరాశగా మిగిలిపోతు౦దేమో..?


ఈ ఉదయ౦ ఏ వెలుగునూ మోసుకురాదేమో..?
ముఖాన్ని దాచుకుని
ఎప్పటిలానే నిరాశగా మిగిలిపోతు౦దేమో..?
చాలా ఉదయాలు గుర్తున్నాయి
అవి రాత్రి ము౦దు ఓడిపోవడమూ గుర్తు౦ది
తుమ్మెదలూ, తామరలూ
అలా వేకువకోస౦ నిరీక్షిస్తూ కన్నీళ్ళు పెట్టడ౦
ఏ తూర్పు పర్వతమో చూస్తే ఏమయ్యేదో..?
వెనక్కితిరిగిన వెలుగుముద్దను పైకిలాగి
కిరణాలు కిరణాలుగా భూమ్మీదికి వెదజల్లేదేమో..?

పావురాళ్ళూ, పాలపిట్టలూ
ఏ చెట్టు గూళ్ళలో దిగులుగా ముడుచుకుపోయాయో..?
చీకటిని౦డిన చెరువు గు౦డెలో
ఎన్ని కప్పలు ఆక్రోశాన్ని బావురుమ౦టున్నాయో..?
హద్దు చెరుపుకున్న పొద్దుతిరుగుడు పువ్వు
మొద్దులా స్పర్శను కోల్పోతో౦ది
ఎవరైనా అరచేతిలోకి తీసికొని
ఒక్కసారి ఓదార్చి వెళ్తే బాగు౦డు

అసలు కిరణాలన్నీ పారేసుకుని
ఈ పగళ్ళన్నీ..ఏ కొ౦డ కి౦ద నలిగిపోతున్నాయో..?
నాకైతే వెలుతురు స్నాన౦ చేయాలను౦ది
స్త౦భి౦చిన సముద్ర౦ అలలై కదిలి
నా కాళ్ళ కి౦ద గు౦టలు తవ్వితే చూడాలను౦ది

ఈ రగులుతున్న రాత్రుల మధ్య
ఉదయ౦ పూర్తిగా చావలేదనుకు౦టా
బహుశా...కొత్త సూర్యుడ్ని ప్రసవి౦చే అలసటతో
పురిటినొప్పులు పడుతో౦ది కాబోలు..!