అంత తేలికేమి కాదు ......
గుండెలో నుంచి ప్రేమని
స్వరపేటికలో నుంచి సంగీతాని బయటకు తీయడం
అంత తేలికేమి కాదు ...
కళ్ళలో నుంచి మొదల్లుపెట్టి
పెదవుల చివరనుంచి ప్రేమని
మధురహాసంగా ప్రవహించనీయడం
అంత తేలికేమి కాదు ...
ప్రతిక్షణం నీతోనే గడుపుతూ
నీ సంభాషణల తాలూకు జ్ఞాపకాలతో
అందమైన పరదాను ఏర్పాటు చేయడం
అంత తేలికేమి కాదు ...
నన్ను వదలి వెళ్ళిన నీకు
నా ప్రేమను గుండెచప్పుడుగా వినిపించడం
అంత తేలికేమి కాదు ......