ఈ రోజు ఎందుకో మనసంతా గందరగోలంగా వుంది..?
కొన్ని పరిచయాలు మనసులో వదలి పెట్టిన అలజడి ఎందుకో...నన్ను తినేస్తున్నాయి..
కారణం వెతికేముందు ఇంత కర్కశంగా ఎందుకు మారతారో అనిపిస్తుంది
ఎదో జరుగుతుంది..జరగబోతుంది..ఏం చేయగలం చెప్పు ..
నేరంనాది కాదు అనుకున్నా నేరస్తున్ని చేస్తున్న పరిస్థితులు...
నేనున్నానంటూ చెప్పిన మనుషులు నీవరూ అని పశ్నించిన పరిస్థిలు గుర్తుకొస్తున్నాయి
కొంచం కూడా మనుసులేకుండా ఎలా ఉంటరో ఇప్పుడూ ప్రత్యెక్షంగా చూస్తున్నా..
అసలు మనుషులు ఇలా ఎందుకుంటారో అర్దం కాదు..?
కొందరేమో " ఏరుదాటందాకా ఏటి మళ్ళన్న..ఏరు దాటాకా బోడిమల్లన్న ..?
ఈ మద్యి ఓ ఇద్దరు నాకు ఇచ్చిన షాక్ ....ఎందుకిలా మారారో తెలీదు..
వాళ్ళూ అంటే భావుకతా ఎంతబాగా వ్యక్తం చేయగలరో కాని అవసరాన్ని బట్టి మారిపోతారు..
ఆ మనిషేమో అలా దారునంగా గుండేళ్ళో కత్తులు దించేసి వెళ్ళింది..ఇప్పుడు నెనెవరో తెలీనట్టుంది
ఎన్నో మాటలు చెప్పిన ఆమనిషికి అవన్నీ గుర్తునాయా లేదో..అర్దంకాదు
ఏంత మంచిగా మాట్లాడిన మనిషి ప్రకృతి అంటే ఏంటో చూపించిన మనిషి
తన చిన్న ప్రపంచంలో నన్నో ప్రత్యేకమైన స్నేహం అంటూ ఊరించిన మనిషి జ్ఞాపకాలు తరుముతున్నాయి..
మనసులో అలజడి ఆందోలన..ఎవ్వరితో మాట్లాడాలని పించడంలేదు..
వెలుతురు భయం అనిపిస్తుంది అంతా ఎప్పుడు చీకటి గా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది..
వెన్నేల కూడా లేని వెచ్చని రాతుల్లు..ఓటరిగా నీజ్ఞాపకాలతో..
కడలి తీరాన ..ఏప్పుడు కమ్మేస్తాయో అన్నట్టు ఎదురు చూస్తున్నా అలలు..
నీవు మాట్లాడుతున్నప్పుడు అమ్మో అనిపించేది ఇప్పుడు ఎప్పుడ కబలిస్తాయా అని ఎదురు చూపులు ..
అస్సలు అప్పడలా ఉన్న నీవు ఎలా మారావు అన్నది ఇప్పటికీ
మొత్తానికి ఓజీవితాన్ని ఇలా చేశావన్న చిన్న భాదకూడా లేనట్టుంది నీకు
ఉడాల్సిన అవసరం ఏంటి నీ హేపీనెస్ నీకు ముఖ్యిం..కదా...?
ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు ..ఎదో జరుగుతుంది ఎమౌతుందో తెలీదు..
ఈ విషయం ఎప్పుడూ మనస్సులో పెట్టుకో
కనిపించే శత్రువు కన్నా చాలా ప్రమాదకారి ఎవరో తెలుసా. నటించే మిత్రులు శత్రువు కన్నప్రమాదకారి