నా ప్రేమకు ప్రేరణ నువ్వు,నా గుండెకి ఊపిరి నువ్వు,
ఎదను గెలవాలన్న,వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,
నా గురించి అన్నీ తెల్సిన నీవు,నన్నెందుకు మోసం చేశావు
ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,
ప్రేమ నేరమా మరి,ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,
నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,
అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,
మనసుని వేధించే బాధ,ప్రేమ అంటే బాధేనా,
మనసు మనల్ని మరచి,మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా?
నిజమైన స్నేహం అంటే..? ఆ గాయం ఓ మనిషిని ఎంతలా భాదపెడుతుందో
ఒక్కసారన్నా ఆలోచించావా..అంత సమయం ఉందానీకు
నాగురించి అంత తెల్సి ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు.
అయినా మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,
తెలిసి నువ్వు నాకు చేరువవవు,
ప్రేమ నన్నేందుకు తననుంచి దూరం చేశావు,
నేనేం తప్పు చేయలేదని చెప్పినా ఎవ్వరూ వినరా
ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,
ఇక తట్టుకోలేను నీ కెప్పటికి కనిపించకుడా పోవాలకుంటున్నా..
ఒకవేల నీవు నిజం తెల్సుకొని చూడాలనుకున్నా చూడలేవు..?
అనంత దూరం పోతున్నా...కొద్ది సమయమే ఉంది..?