Monday, October 10, 2011
మరణ శయ్యమీద ఉన్నానని తెల్సీ...మౌనంగా ఎలా ఉంటున్నావు
మరణ శయ్యమీద ఉన్నానని తెల్సీ...మౌనంగా ఎలా ఉంటున్నావు
వారావరణం లో మార్పులు చూస్తా...కొద్దిసెపట్లో ఉన్న వేడి మరికాసేపట్లొ ఉండదు..
మనుషుల్లో అలా షడన్ గా మారిపోతారా..అది ఎలా సాద్యిం...
ప్రతి నిత్యం ఎంతో మందిని చుశా..ఎందరినీ కల్సా ఎన్నీ జీవితాలు చూశా...
ఇంత ప్రపంచాని ఈజీగా చదివిన నేను ..నిన్ను గురించి ఎన్నో తెల్సుకున్నా..
నీ కొద్దిపాటి పరిచయంలోనే ప్రకృతిని ...మరో అందమైన ప్రపంచాన్ని చూశా..
అంతటి అద్బుతమైన తీయ్యటీ అనుబందం నీది..అలాంటినీవు ఇప్పుడు..?
నిజమా అని నమ్మలేకున్నా కాకుంటే బాగుండు అనుకున్నా ఎందుకిలా.?
ఒకప్పుడు నాగురించి వున్న కేరింగ్ ఎలా మాయం అయింది...చిన్న చిన్ని విషయాలకే కంగారు పడ్డ నీవు
ఇప్పుడు మరణ శయ్యపై ఉన్నా నని తెల్సీ హేపీగా ..ఎలా ఉండ గలుగుతున్నావు
అన్నీ అర్దం చేసుకున్నా కష్టం అయినా నీ సతోషం కోసం
...ఎన్నో భరించా భారం అయినా..కళ్ళలో కన్నీరు నింపుకొని కూడా
మీరు బాగా అర్దంచేసుకుంటారండీ అందుకే మీరు నచ్చుతారండీ అన్న నీవు
ఇలాంటి పరిస్థితుల్లొ నన్నెందుకు అర్దంచేసుకోవు
అన్నీ తెల్సు జరిగేవన్నీ చూస్తున్నావు మౌనంగా ...మరి నీమౌనాన్ని ఎమని అర్దం చేసుకోను..
Labels:
కవితలు