పంచ భూతాల వెంటే ప్రకృతి అందమా
వెన్నెల కి తోడు జాబిలి రూపమా ..!
వేకువ నాది యని తెలిపే కోయిల పాట
మెలకువే ఏదని పలికే కోడికూత
శిలలు సైతం తెలిపేశిల్పంలాంటి నీవు
ఈ సూర్యుడంటే చెంత శూన్యమా .?
గెలుపేదో ,ఓటమేదో లోపు తీరని దూరం లో నీవు
పడిలేచే కెరటం లా పరుగు తీస్తావు పడమరకు
అలసినా కడవరకఒంటరినే అవుతాను తుది వరకూ..
నిజం అన్నది నిగ్గు తేలక భగ్గుమన్నది అగ్గి హృదయం
మంటను రేపి నిండు దేహం ..అవమానాలతో
అసలు కథ ఇదీ అన్నది ఎరుగలేని యధలకు ఎప్పుడూ
ఎదురుగాని విధిని ఇప్పుడు ఏ చెవినీ చేరదు ఈ గుండె చప్పుడు
అందుకే ఆగిపోనీ నాగుండె ఎక్షనమైనా...