Saturday, October 15, 2011
ఎవ్వరి ఆనందంకొసమో..నన్ను భాదపెట్టావు..అయినా నేను మారలేదు.
సుఖదుఖాఃలలో నీ బుగ్గలపై జారే క'న్నీటి' సాక్షిగా...
'భూమి' అంత చల్లనైన నీ మనస్సు సాక్షిగా...
'ఆకాశం' అంత విశాలమైన నీ హృదయం సాక్షిగా...
నీ శ్వాసలో చేరే స్వచ్ఛమైన 'గాలి' సాక్షిగా...
కోపంలో నీ కనులు కురిపించే 'నిప్పు'ల సాక్షిగా...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను...!
ఇప్పుడే కాదు ఎప్పటికీ నాది ఇదే మాట చివరివరకు..
నీవెన్నోసార్లు ......అయినా....నేను మారలేదు..
ఎవ్వరి ఆనందంకొసమో..నన్ను భాదపెట్టావు..అయినా నేను మారలేదు..
భాదపడతానని తెల్సినా ..నన్ను.....?
ఎన్ని జరిగినా ఎమైనా...నా మాట ఒక్కటే..
నేను నిన్ను ప్రేమిస్తున్నాను...!
విషయం నీకు తెల్సు అయినా నీవు....?
ఇప్పుడే కాదు చివరి శ్వాసవరకు నాది ఇదేమాట అని కూడా నీకు తెల్సు..
Labels:
కవితలు