గతంలో నచ్చిన నెచ్చెలి ఇచ్చిన కానుక
ఈ రేయి నులివెచ్చగా తాకుతుంటే,
ముచ్చట గొలిపే తన స్వచ్చమైన ప్రేమను
మదిలోనే మనసారా మెచ్చుకుంటూ,
నా మదిలో తన ఊసుల చిచ్చుపెట్టిన
కానుకను ముద్దుపెడుతూ మెచ్చుకోలుగా
ఈ నిశిరాతిరి ఒడిలో, జ్ఞాపకాల కౌగిలిలో
కునుకుతీసా కాసేపు ...........
వాలుకనుల చూపుల వయ్యారితనం,
జాజిమల్లెల పరిమళాల జాణతనం,
పసిడిఛాయ మేనిలో ఓ మెరుపుతనం,
అద్బుతమైన నీఅందం కళ్ళలో మెరిసే ఆ మెరుపులు
పెదవిపై కదిలాడే చిరునవ్వు అందానికే ఓ నిండుతనం!!!
నా మనసు సప్తాశ్వాలపై పరుగులెడుతున్న ఆ తరుణాన,
నాతో కునుకులేని ఆలోచనలు ఆడుకుంటున్న ఆ సమయాన,
నా మది దోచిన ఆ చిన్నారికి చెప్పాను ఐ లవ్ యు
తానూ ఐ లవ్ యు చెప్పింది నీవంటే ఇష్టం ,రెస్పెక్టు అనీ ఎన్నో చెప్పింది
కాని ...చివరకు ద్రోహం చేసి ద్రోహిని చేసింది..
ఎవరికి చెప్పుకోలేక చెప్పే దైర్యంలేక జరుగుతున్నది ఒప్పుకోలేక..
మరణ శయ్యపై నిల్చున్నా ..నిజం తెల్సుకొని ఎప్పటికైనా ఓదారుస్తావని.
కాని రోజు రోజుకి ఆశ నీరుగారి పోతుంది ..నిరాశ జివ్వున లావాలా గుండేళ్ళో హోరెత్తిస్తోంది..
హోరెత్తిస్తున్న లావాలో ఆ అగ్నిలో ఏప్పుడో శిలగా మారి శిధిలం అవుతాను..