Monday, October 3, 2011
గతించిన కాలం గుండె నలిపేస్తున్నా..
నీ తలపుల వాకిట కునుకు తీసా!
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో!
కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా
అంతలోనే నిదురలేచా
హైదరాబాద్ మొత్తం వెతికిచూసా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే
నిరాశతో నా హృదయాన్ని తట్టి చూశానిలచివున్నది నీ రూపం
చిరునవ్వులొలుకుతు హృదయంలో నిదురిస్తుంటావు
గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!
గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,
నీవు లేని ప్రతిక్షణం నీ ఆలోచనలతో ఎదురు చూస్తున్నా,
నీ కోసంకోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!
కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!
Labels:
కవితలు