Sunday, October 23, 2011
కరిగిపొతున్న కాలం తనతో బాటు నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది,
మృత్యుకౌగిలిలో బిగుసుకుంటున్నాను,మరణ సెయ్యపైకి ఎక్కబోతున్నాను,
చావు నాకు చేరువగా కనబడుతుంది,వెన్నెల కారి నల్లని చీకట్లు కమ్ముకుంటున్నాయి
కన్నుల ముందున్న నీ రూపం మసకబారుతోంది,తోడుగా ఉన్న నీ చెయ్యి నా నుండి జారిపోతుంది,
నీ కన్నుల నుండి జారే కన్నీటి బొట్లు నా గుండెపై పడుతున్నాయి,ఈ విషయం తెల్సిన నీ ఆనంద భాష్పాలనుకుంటా అవి
కరిగిపొతున్న కాలం తనతో బాటు నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది,మరణం వైపు నా ప్రయాణం ప్రారంభమయ్యింది,
ఐనా మరణం నాకు ఆనందమే,వెళ్ళిపోతున్నా ప్రియతమా మనసుని నీకు వదిలేసి.
ఆ మనసును బద్రం ..నేను వెళ్ళగానే చెత్తకుప్పలో పడవేయకు..
నీ వల్ల చితికి పోయిన మనస్సు అది చావలేక ఇప్పటిదాకా బ్రతికిన మనస్సు అది..
బద్రంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావో..దూరంగా ఇసుక తిప్పల్లోకి విసురుతావో..
విరిగిపోయిన మనస్సును బద్రంగా పెట్టుకుంటావని అనుకోనులే..అది నీఇష్టం..
నా లాంటి స్నేహితులు నీకు ఎందరో ...నీవు ఒక్కదానివే మస్సాక్షి స్నేహితురాలివి
Labels:
కవితలు