Tuesday, October 4, 2011
పాతజ్ఞాపకాలు మనసును ప్రతిక్షనం చింద్రం చేస్తున్నాయా.?
నీది ప్రేమేనా! స్పర్శ, భావము,
వేదన.మోహం,ఉద్వేగం,
ప్రణయాలను విడదీసి చూడు!
అయినా ...
నీ హృదయం పరితపిస్తుంది ...ఆమె చుట్టూనే
ఆమె భారము, సంరక్షణ ఆకాంక్షై
అయితే
నీది ప్రేమే ... నీవు ప్రేమికుడివే!
అమె ఎన్నిమాటలన్నా...నిన్ను కాదన్నా
నీ హృదయం అమెకోసమే తపిస్తుందా..?
నీది ప్రేమే ... నీవు ప్రేమికుడివే!
తను నీకు దూరం అయినా ఇంకా గుర్తుకువస్తుందా..
ప్రతిక్షనం తనే కావాలని మనస్సు ఆరాట పడుతుందా
నీది ప్రేమే ... నీవు ప్రేమికుడివే!
ప్రతిక్షనం ఆమె గుర్తుకు వస్తూ నీకు నిదురలేకుండా చేస్తుందా
ఒకసారి కనిపించి మాట్లాడితే ఎంత బాగుండూ అనిపిస్తుందా
నీది ప్రేమే ... నీవు ప్రేమికుడివే!
పాతజ్ఞాపకాలు మనసును ప్రతిక్షనం చింద్రం చేస్తున్నాయా.?
తను ఎక్కడ ఉందాని ప్రతిక్షనం మనస్సు నిన్ను ప్రశ్నిస్తుందా..?
నీది ప్రేమే ... నీవు ప్రేమికుడివే!
తనే కావాలని నీ మనస్సు కోరుకుంటుందా..?
అమె లేని ప్రపంచం వద్దని పిస్తుందా ...?
నీది ప్రేమే ... నీవు ప్రేమికుడివే!
Labels:
కవితలు