ఏమి కానీ నీవు నా జీవితము లో కీ వచ్చావు ..నాకు తెలుసు నీ రాక శాశ్వతము కాదు అయిన నా పిచ్చి మనసు ఊరుకోదు.నీ రాక తో నా ఎడారి లాంటి జీవితము లో వెన్నెల వచ్చింది మిత్రమా .... జరిగిందతా నిజం అని నమ్ని చివరికి అదంతా బ్రమే అని తెల్చావు..కచ్చితంగా నాకు జరిగినట్టు ఎవ్వరికి జరుగదు..అదీ నీవు ..అందరికి రెస్పెక్టు ఇస్తావు ఒక్క నాకు తప్ప..అందరితో మంచిగా మాట్లాడుతావు .. ఒక్క నాతో తప్ప..నిజం నీడలా వెంటాడుతున్నా... అనిజం అబద్దం ఎందుకు కాకూడదు అని వేలసార్లు అనుకున్నా నిజం ఎప్పటికీ నిజమే ..అది..నన్ను వెంటాడి వేదిస్తుంది..ఎదురుగా జరిగిన జరుగుతూన్న ఘటనలకు ఇంకా కాదేమో అని ఎలా అనగలను ..?
నీవు వస్తున్నావు అంటే ఆనందం .నీకు స్వాగతము చెప్పటము కూడా మరచిపోతా ,, వెళ్ళిపోతున్నావు అన్నా బాధ లో నీకు వీడుకోలు కూడా పలకను...నీ నుంచి దూరంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తే, నా ప్రమేయం లేకుండానే మళ్ళీ నీ వైపుకే పది అడుగులు పడిపోతుంటే ఎలా ? ఒక్క నువ్వు ఒక్క నాలో ఇన్ని వేల వేల తలపుల్ని పూయించడం ఎంతటి విచిత్రము కదూ! నా నువ్వైపోతూ నీ నేనుగా మారిపోతున్నఈ క్షణాన.. ఏమని చెప్పాలి నీకసలు...... ఏమని అడగాలి నిన్నసలు.. ఎవరనుకోవాలి నిన్నసలు..!?
కొన్ని సార్లు అనుకొంటా .... నీ నుంచి వెళ్ళిపోదాము అని, . ఎందుకు అంటే నా దురదృష్టము నీకు ఎక్కడ వస్తుందో అని భయము ... ఒకప్పుడు నమ్మినంతగా అన్ను ఎందుకు నమ్మడం లేదు.. నేను మారలేదు అప్పటి మనిషినే అని ఎందూ గుర్తించవు...ఎవ్వరు ఏది చెప్పినా నమ్మేస్తావా... నేనేటో తెల్సు వాళ్ళు స్వార్దంకోసం నాగురించి ఏం చెప్పినా ఎలా నమ్ముతావు ..కావలని అన్నావో అంటున్నావో తెలీదుకాని ప్రతి మాటల్ నాగుండెళ్ళొ గుణపాలయి గుచ్చుకుంటున్నాయి తెలుసా..ఎందుకిలా అంటున్నావని అడుగలేను..ఆర్హత లేదని ఎప్పుడో తేల్చావు సో నాకు ఇక మిగిలింది..?ఏదో ఒక రోజు వెళ్లి పోతా మిత్రమా ....