కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా
అంతలోనే నిదురలేచా
ఊరంతా వెతికిచూసా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే
నిరాశతో గృహము చేరా
నిలచివున్నది నీ రూపం
చిరునవ్వులొలుకుతు చిత్రపటంలో
నా రాకకై ఎదురుచూస్తూ
గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!
గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,
నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!
కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!