కన్నుల్లో నీ రూపం.... గుండెల్లో నీ ధ్యానం
అనుదినం నీ కోసం నిరీక్షణ..
నిన్నే ప్రేమించానే.. నను నేనే మరిచానే
క్షణ క్షణము నాలో ఓ సంఘర్షణ...
ఆనాటి నీ పరిచయం చేసింది ఓ అద్భుతం
నీ రాకతో జీవితం అయింది పువ్వులవనం..
చిరునవ్వు విసిరావే.... నా మదినే దోచావే
మత్తేదో చల్లావే.... గమ్మత్తుగా
నాకే తెలియని నన్ను కొత్తగా చూపించావే..
మాయేదో చేశావే .... మైమరిపించావే
నా వెంటే నువ్వుంటే యుగమొక క్షణము
నువు దూరమైతే క్షణమొక యుగము...
నను వీడి వెళ్లొద్దే చెలియా.. చెలియా
ఒంటరిని చేయ్యోద్దే సఖియా సఖియా
తప్పేదో ఒప్పేదో నాకసలు తెలియదులే
తెలిసింది ప్రాణంగా ప్రాణంగా ప్రేమించడమే....
కలలోనూ మరువనులే .. ఇలలోనూ విడువనులే..
నేనున్నా లేకున్నా ...... నీ నీడనే
పసిపాపకు మల్లే నిను..... ప్రేమిస్తానే
నీ కనురెప్పను నేనై ..... జీవిస్తానే
సరిరారు లోకంలో..... నాకెవ్వరూ
నను మించి నిన్నెవ్వరు ప్రేమించరు..