అనగనగా... ఒక అందమైన ఉధ్యానవనం ....
అందులో .. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే
అందమైన గులాబి పువ్వు ....
అనుకోని విధంగా ఆ తోటలోని పావురంతో స్నేహం కుదిరింది ...
ఆ గులాబి నవ్వుని చూసి పావురం ఎంతో సంతోషించేది...
అలా స్నేహలోకంలో విహరిస్తూ ఆనందంగా రోజులు గడచిపోతుండగా....
రోజులన్నే ఒకలా ఉండవ్ కదా....
ఒకసారి పావురం తనమాటలతో గులాభీని బాధ పెట్టింది...
గులాబి చాలా బాధపడింది ... తన నవ్వు వాడిపోయింది...
తన తప్పు తెలుసుకుని క్షమించమని గులాబిని బ్రతిమాలింది...
స్నేహితులమధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా...
మన్నించి తన స్నేహ హస్తంని అందించి ...
ఎప్పటిలా వారు ఇరువురు చాలా సంతోషం గా మంచిమిత్రులుగా
కలిసిమెలసి జీవించసాగారు.....