Wednesday, March 28, 2012
దేవుడిచ్చిన స్నేహితురాలు .. రియల్ Story ( నాలో నేను)
కాలం కలికాలం కలిసివస్తే మంచి రోజులు .. కల్సిరాకపోతే కలికాలం తిట్టుకుంటాం .. భాద పడతాం అన్నీ మనకే ఎందుకు జరుగుతున్నాయో అంటూ ఏడుస్తాం...కొన్ని బందాలు భాదను మిగులుస్తాయి.. బ్రతుకు భారంగా అనిపిస్తుది...ఎంతో ప్రేమగా మాట్లాడిన మనుషులు కటువుగా మాట్లాడటం తట్టుకోలేం...నేనున్నా అంటూ పలుకరించిన స్నేహం నీవెవరూ అని ప్రశ్నిస్తే..మనసులోని మనిషి దారూనంగా భదపతాం..కొన్ని పరిచయాలు అలా భాదపెడతాయి.... అది వాళ్ళ తప్పూ కాదు ..పరిస్థితులు వాళ్ళని అలా అనిపిస్తున్నాయి..నేనున్నా అని సుతి మధురంగా పలుకరించిన స్నేహం నీవెవరూ అని అయిష్టంగా పలుకరిస్తే..ప్రతిక్షనం ఆమాటలు గుర్తుకు వచ్చి మనసుకు అళ్ళ కళ్ళోలం చేస్తాయి...
ఏప్పుడో పరిచయం అయింది ఈ మద్యి మళ్ళీ అన్ లైలోకి వచ్చి షడన్ గా పలుకరించింది ఓ అందాల బొమ్మ బాపు బొమ్మ...మాటల్లో తీయ్యదయం..మైమరపించే మంచితనం.స్నేహం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది..ఊరిస్తుంది..లాలిస్తుంది..కవ్విస్తుంది..కన్నెర్ర చేస్తుంది......అందమైన పరిచయం...నాకు పెద్ద ఫేన్ అని చెబితే నమ్మలా నాబ్లాగ్ ... నన్ను ఎప్పుడూ గమనిస్తున్నాను అని చెప్పింది మొదట నమ్మలా కాని కొన్ని నిజాలు నమ్మేలా చేశాయి మరి..నేనెక్కడ తనెక్కడ...చిన్నగా మొదలైన స్నేహం..కన్నెర్ర చేసేంత గా పరిచయం పెరిగి..మనసులో దూరి జ్ఞ్జాపకాలతో కాసేపు చలగాట మాడి ఆరిందిలా సలహాలు ఇవ్వడమేకాదు..నీవు సంతోషంగా ఉండాలి అని రిక్వెష్టుగా చెప్పి...నీవేంటీలా అని బెదిరించే కాడికి వచ్చింది మరి..అమె మాట్లాడుతుంటే మైమరచి..అలా వింటూ ఉండాల్సిందే... మనిషి కనిపిస్తూ.. ఎదురుగా ఉండి కల్సి మాట్లాడుకోవల్సిన పనిలేదేమో ఇలా కూడా భాదలు షేర్ చేసుకొంటూ పెద్ద అరిందిలా జీవితాన్ని చదివిన మనిషిలా చెబుతుంటే బలే అనిపిస్తుంది..ఇలా సాగుతున్న మాస్నేహం కలకాలం ఉండాలనిపిస్తుంది...నాకు ఇష్టమైన ఆమెగురించి చెబితే .. నన్నే తిడుతుంది.. అమె మంచిది నీదే తప్పు అంటూ నన్నే తప్పు పడుతోంటే ఆచ్చర్యం వేసింది..నీవు నెగిటివ్ గా ఆలో చిస్తున్నావు .. అమె అలా ఎందుకు అందో నీకేం తెల్సు నన్నే నిలదీసింది..మేం ఎప్పుడూ కలవాలనుకోవడంలేదు ఇలాగే స్నేహంగా ఉండాలనుకుంటున్నాం..స్నేహానికి పెద్దా చిన్నా తేడా ఏమీ లేదేమో అనిపించింది..అందులో నేనంటే నా ఫ్రొఫిషన్ అంటే ఇష్టపడే స్నేహితురాలు .. పరిచయం గమ్మత్తుగా అయినా అప్పుడు అలగా వచ్చి కలగా మారినా నా స్నేహితురాలు లాగానే తను మిగిలిపోతుందా...? దేవుడిచ్చిన ఈమె మాటలు వింటుంటే.. ఏదో మాయ చేస్తొందా అనిపిస్తుంది..నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంట ... సంతోషంగా ఉంటే అన్ని భాదలు తీరతాయంట.. నా మనసులో ఉన్న స్నేహితురాలు సంతోషంగా ఉండాలని నేనూ ఎప్పుడూ కోరుకోవాలంట..ఇలా నాతో ఎన్నో చెప్పించి... దేవుడిచ్చిన స్నేహితురాలు బుక్స్ బాగా చదుతుంది..ఇంట్లో తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుంది..నిజంగా ఆమె మాటల్లో ఎదో మాయ ఉంది ఎదుటి వాళ్ళను మాట్లాడనీయదు.. తను చెప్పింది వినాలి అంతే అలా వినేలా చేస్తుంది......( చెప్పటానికి ఇంకా చాలా ఉంది తర్వాత చెబుతాను )
Labels:
జరిగిన కధలు