నీ నవ్వులో ఏమి దాచావో చెప్పవా
అలానే చూస్తూ ఉండాలని పిస్తుంది రెప్ప వాల్చక
నీ నడకలో ఏమి వయ్యారము దాగుందో కదా
తడబడినా అడుగులు పడుతున్నై నీ వెనకే
నీ మాటలో ఏమి మంత్రము వేసావో కదా
మత్తెక్కిన మనసు వింటున్నది నీ మాటే
నన్ను నన్నుగా నిలవనియక నన్ను
పూర్తిగా అసహయుడిని చేసావు చిరునవ్వులతో
గెలిచానో ఓడానో తెలియని అయోమయంలో
మళ్ళి ఓడిస్తున్నావు నీ వొడిలో సేద దీర్చి
నన్ను నేను పూర్తిగా కోల్పోఇనా
ఇంత ఆనందం ఉంటుందా నీతో ఓటమిలో ??