నా మనసులో నీ సంతకాలు...
గురుతుకొచ్చే జ్ఞాపకాలు...
దాచలేనే మొయ్యలేనే తీసుకెళిపోవే...
మార్చుకున్నా పుస్తకాలు...
రాసుకున్నా ఉత్తరాలు...
కట్టగట్టీ మంటలోన వేసిపోవే...
నే అటువైపో... ఇటువైపో... ఎటుఎటు అడుగులు వెయ్యాలో
తెలియని ఈ తికమకలో తోసేశావేంటే ప్రేమా...
నువు అంటే... నాలాంటి... ఇంకో నేనని అనుకున్నా
నాలాగా... ఏనాడూ... నువ్వనుకోలేదా ప్రేమా...?
ఆశలెన్నో పెట్టుకున్నాను
కన్నకలలన్ని కాలిపోతుంటె ప్రాణం వుంటదా?
చెలి చిటికెడంతైన జాలి లేదా...
తట్టుకోలేను ఇంత బాధా...
అడగలేకా... అడుగుతున్నా... నేను నీకేమి కానా..!?
ఆ తలపుల్లో... తడిపేసే... చినుకనుకున్నా వలపంటే
కన్నుల్లో... కన్నీటి... వరదైపోయావే ప్రేమా...
మనసెపుడూ... ఇంతేలే... ఇచ్చేదాకా ఆగదులే
ఇచ్చాకా... ఇదిగిదిగో... శూన్యం మిగిలిందే ప్రేమా...
చరణం:2
వేయి జన్మాల తోడు దొరికింది
అన్నమాటే మరచిపోలేను
ఒప్పుకో లేను... తప్పుకోలేను... ప్రేమా ఏంటిలా..?
కనుపాపలో వున్న కాంతిరేఖా...
చీకటయ్యిందె నువ్వులేకా...
వెలుతురేదీ... దరికిరాదే... వెలితిగావుంది చాలా...
నా.. జతనువ్వే... గతినువ్వే... అనుకోడం నా పొరపాటా ?
చెలినువ్వై... చిరునవ్వే... మాయంచేశావే ప్రేమా...
అటునువ్వూ... ఇటునేనూ... కంచికి చేరని కధలాగా
అయిపోతే... అదిచూస్తూ... ఇంకా బతకాలా ప్రేమా...?