గుండె గదిలో పదిల పరిచా నీ జ్ఞాపకం..ప్రియా
పసిడి రేకులో మడిచి నీ జ్ఞాపకం..ప్రియా
మడత విప్పి చూసుకుంటే…వ్యాపించెను పరిమళం…ప్రియా
హ్రిదయంతో తడిమి చూసా వికసించిన యవ్వనాన్ని..
మదిని మురిపించీ కవ్వించే నీ జ్ఞాపకం…ప్రియా
వడలలేని కుసుమమల్లే నీ జ్ఞాపకం…ప్రియా
గుండె గదిలో పదిల పరిచా నీ జ్ఞాపకం..ప్రియా
వడలలేని కుసుమమల్లే నీ జ్ఞాపకం…ప్రియా
మనస్సు పొరల్లో జ్ఞాపకాల అలలు..ప్రియా
ఎగసి పడి రకరకాల తీరాలను తాకాయి..ప్రియా
తీర తీరానికో తీపి గుర్తు..ప్రియా
ఈ జీవన సంద్రం లో ప్రియా
కడలి లో కరిగిపోయిన కలలెన్నో..ప్రియా
అయిన అలసి పోని అలలు కదులుతూనే ఉన్నయి..ప్రియా
మనస్సు పొరల్లో జ్ఞాపకాల అలలు..ప్రియా
ఎగసి పడి రకరకాల తీరాలను తాకాయి..ప్రియా
తీర తీరానికో తీపి గుర్తు..ప్రియా
ఈ జీవన సంద్రం లో ప్రియా
కడలి లో కరిగిపోయిన కలలెన్నో..ప్రియా
అయిన అలసి పోని అలలు కదులుతూనే ఉన్నయి..ప్రియా