ఎవరిని చూసినా గుండె కొట్టుకుంటుంది కానీ
నిన్ను చూస్తేనే గుండె ఆగిపోతున్దనిపిస్తుంది !
ఎవరితో ఎన్నైనా మాట్లాడగలను కానీ
నీతో మాట్లాడాలంటే మాట తడబడుతుంది !
ఎవరినైనా కన్నులలో కన్నులుంచి చూడగలను
నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను ఎందుకో !
ఎవరి వెనక నడవాలన్నా ఇష్టం వుండదు కానీ
నీ అడుగులలో అడుగువేస్తే ఎంతో ఇష్టం నాకు !
ఎవరితోనైనా కొంత సమయమే ఉండాలనిపిస్తుంది
నీతో మాత్రమే జీవితాంతం ఉండాలనిపిస్తుంది
కాని ఆరోజులు పోయాయి..నీవు పూర్తిగా మారిపోయావు
చెప్పుకోలేనంతగా...తట్టుకోలేనంతగా ఎందుకు మారావో తెలీదు
చేయని అన్ని తప్పులకు నన్నే బలి చేస్తూ..నన్నిలా
చేస్తావని ఇంత దారుణంగా మాట్లాడతావని కలలో కూడా ఊహించలేదు
మనసు ఎప్పుడో గాయం అయింది.. చేసింది నీవే..?
ఆ గాయాన్ని తగ్గంచలేనంత దూరంగా నీవు .. నీ ఆలోచనలతో ప్రతిక్షనం నేను ఇలా ఎన్నాళ్ళో