. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, March 11, 2012

నిన్ను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయా..

మోడుబారిపోయిన హృదయం మీద
నీ చూపు పన్నీటి జల్లులు కురిపించింది
గుండె కవాటాలు మూసుకుపోయిన చోట
నీ స్వచ్చమైన నవ్వు రక్తమై నాలోకి చేరిపోయింది
చావు బతుకుల మధ్య ప్రాణం పోలేక కొట్టుకుపోతుంటే
నీ స్పర్శతో అడ్డుకున్నావు ..నా నుదుటి మీద గాలై వాలిపోయావు
ఏకాంతపు వనంలో పెదవుల కదలికలతో
నాలో చచ్చిపోయిన ప్రేమను బతికించావు ..
కానీ కాలం ఎప్పుడూ ఎవరినీ ఒకచోట నిలువనీయదు
కలిసిన మనసులను విడదీస్తుంది
గుండెల్లో రేగిన ఆరాతాలకు అడ్డుకట్ట వేస్తుంది
అన్నీ ఉన్నా మనం ఇంకా సంచారంలోనే ఉన్నాం
అంతులేని ప్రపంచంలో దేనికోసమో ఇంకా వెతుకుతూనే ఉన్నాం ..
ఇలా ..ఎంతకాలం ప్రయాణం చేయాలో తెలియక నా గుండె మండుతోంది
నిన్ను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయా..
నీ కోసమే ..నేనై ఉండిపోయా ..
కలల కౌగిట్లో వాలిపోదామనుకుని పడిపోయా ..
నువ్వు వస్తావని ..వేచి చూస్తూనే ఉన్నా
చెలీ నన్ను క్షమిస్తావు కదూ .."