దీని జవాబు ఎమిటి ??? నీకు తెలుసా ???
మోడులా మారిన చెట్లతో
ఎండిపొయిన పిల్ల యేరుతో
రాబందుల చూపులతో
ఎడారి వేడిగాలులతో
ఎలసిపొయిన రంగు గోడలతో
పాలిపొయిన తాటాకు కప్పుతో
శూన్యచూపుల సహచరులతో
భగ్న ప్రేమికుల బడిలో
నిలచి ఆలోచిస్తున్నాను
నీ ఒడిలో ఉన్నదేమిటి?
ఇప్పుడు లేనిదేమిటి?
పోగొట్టుకున్నదేమిటి?
పొయినదేమిటి?
...శ్రీ...