చెరిగిపోయిన జ్ఞపకంలా మిగిలిపోతానని..చిరిగిన కాగితంలా మారుతానని..
కలలో కూడా ఊహించలా ..గుండెళ్ళో బాంబులు పేలిన క్షనంలో ఓ నమ్మకం..
ఆ నమ్మకం ఎన్నోభాదల్ని తట్టుకున్నా కాని.. ఆతర్వాత ఒక్కొక్కటిగా జరిగిన ఘటనలు
నీనోటినుంచి వచ్చిన ఒక్కో మాట తూటాల్లా..గుండేళ్ళో గుచ్చుకొనే ఉన్నాయి
ఎలా అనగలిగావో ఎందుకన్నావో తెలీదు..కాని పదునైన కత్తుల్లా గుండెళ్ళో గుచ్చుకున్నాయి
ప్రతిక్షనం నీజ్ఞాపకాల కదలాడినపుడల్లా ఆ కత్తుల తాలూకా గాయం నన్ను వేదిస్తుంది
ఎలా అనగలిగావో ఎలా అన్నావో తెలీదు...చచ్చిపో అని ఏలా అనగలిగావు..
చిరవరికి నీవెవరివి అనేదాకా వెళ్ళావంటే...నీ మనస్సులోనేనేమిటో అర్దం అయింది..
అందుకే మౌనంగా శాశ్వ్తంగా దూరం కావలనుకున్నా అయినా నీకేంటే ..నన్ను ఎవరు నీవు అన్నావుగా..
నిజమే నీవిషయంలో నేనెవరిని..ఏమౌతానో అని ప్రశ్నించుకుంటే సమాదానం దొరకలేదు...?
నీవేం చెబితే అదే నిజం నీవేం అంటే అదేవాస్తం అదే నమ్ముతా ఎప్పుడూ ..?
ఎందుకంటే నీవంటే ఎంత ఇష్టమో నీకు తెల్సో లేదో తెలీదు.. నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు..
నీవు అన్న ప్రతి అక్షరం అప్పుడన్నవి..ఇప్పుడన్నవి గుండెళ్ళొ పదిలంగా పెట్టుకొని వెలుతున్నా..
ఎప్పుడో చెప్పను ఎక్కడికో చెప్పను ...ఎందుకంటే ఎవరు నీవు అన్నావుకద...?
ఇలా ప్రతిక్షనం నాలో నేను రగిలి పోతూ..అగ్నికి ఆహూతి అవ్వాలని చూస్తున్నా..
ఎమీ చేయలేక ... ఎమనాలో అర్దంకాక ..జరిగింది జరుగుతోంది ఎంటో అర్దం కాక కఫ్యూజన్ లో కాలిపోతున్నా..