నీ పరిచయమొక గతం,
నీ స్నేహమొక శఖం,
నీ ఊహలొక నరకం,
నీ జ్ఞాపకాలోక శాపం.
తలచుకున్నాను ప్రతి క్షణం
నీ తీయ్యని మాటలు,
నీ చిరు నవ్వులను,
నీ అందమైన మోమును,
నీ అంతులేని మాటల ప్రవాహాన్ని,
ఎన్నో నిద్రలేని రాత్రులు,
ఎన్నో ఉలికిపాటు మెలుకువలు
ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు,
అంతలోనే నీ ఒడి చేరాలనే కన్నీళ్ళు..
సాద్యిం కాని ఆశలు..ఎన్నాళ్ళిలా..
రెప్పపాటులో జరిగిన ఘటనలు..
ఊహకందని వాస్తవాలు...
ఎందుకిలా మౌనంతో నరకం చూపిస్తున్నావో..?
అర్దకాని అర్దం చేసుకోలేని పరిస్థితులు.