ఆమె నవ్వితే
అచ్చం పాలపిట్టలా ఉండేది
ఎక్కడో పోగొట్టుకున్న దుఖంలా నన్ను చుట్టూ ముట్టేది
ఆమెతో పరిచయం గొప్పనైన అనుభవంగా మిగిలింది
అప్పుడప్పుడు కాలం నదిలాగా సాగిపోయేది
శరీరం దూది పింజె లాగా మారిపోయేది
ఆకాశమైన నీ హృదయం మీద
నేను ఆలోచనల సంతకాలు చేసి వెళ్ళిపోతున్నా
గతం ఊట బావిలాగా నన్ను తోడేస్తోంది
నన్ను నేను సముదాయించుకునే లోపే
జీవితం గడిచిపోయింది ...
ఇప్పుడు కలలా నువ్వు ..కన్నీళ్ళలో నేను
ఇద్దరి దారులు వేరయ్యాయి
ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి
కానీ ..మన మధ్య ప్రేమ మాత్రం
పొద్దు పొడుపై వాలిపోతోంది ...
నువ్వు నేను ఒకటేనని చెబుతోంది .."
- Basker