నిదురించిన కలతను నిదుర లేపకు నేస్తం
నిదురలేస్తే నీకేమీ కాకుండా నిష్క్రమిస్తాను
ఎదురీతలో ఎడబాటు కాకూడదు నేస్తం
ఎడబాటైతే అగాధాలలోకి అద్రుశ్యమైపోతాను
పలకరింపులో కరుణ కరుగనీయి నేస్తం
కనుమరుగైతే కన్నీటి పర్యంతమవుతాను
భవబంధాలు ఏవైనా మోసే భాధ్యత నీదే నేస్తం
బరువు నాకొదిలితే బ్రతుకు భారమవుతు౦ది
వెంటాడే నా చింతలు విని చిన్నబోకు నేస్తం
చిన్నబోతే నా చిగురుటాశ ...