దేనికైనా కారణం ఉంటుంది కాని నా కన్నీళ్లకు కారణం ఉండదు..
కొన్ని పరిచయాలు కన్నీటిని ప్రతిక్షనం గుర్తుచేయడాని కే పరిచయం అవుతారేమో
పరిచయం ఉన్న కొత్తలో..తర్వాత ఉన్న ..మనస్సు ఎందుకు షడనన్ గా మారుతుంది
ఇక్కడ నీతి నిజాయితీ ....అక్కరలేదు.. బ్లఫ్ చేయాలి మాయచేయాలి అప్పుడే అవే నమ్ముతారేమో..?
ఒక్కసారికి ఎలా మారతారు..ఎదుటి మనిషి గుండెళ్ళో దిగేలా దారుణంగా ఎలా మాట్లాడుతారు..
ఎదుటి మనిషి ఫీలింగ్స్ అక్కరలేదు ..భాదపడతారని తెల్సీ ..గ్రేట్ కదా..?
మనిషి మాటల్లో మాధుర్యిం కరకుగా మారటం వెనుకు కచ్చితంగా ఎవ్వరో ఉన్నారు
వాళ్ళు కావాలని అనిపిస్తున్నారు నీవు అంటున్నావు.నేనేంటో తెల్సి కూడా
అందుకే నాగొంతు నొక్కేసావు..ఇక నాకు మాటలు రావు.. మౌనం రోదించడం తప్ప
రాగాలు పలకాల్సిన గొంతులో రక్తం పెల్లుబుకుతోంది.. తప్పు నాదే..
నేరస్తున్ని చేసి ఓ శాడిష్టు నన్ను బలిపసువును చేస్తే నీవు నమ్మావు
మనిషిగా ఎప్పుడో చచ్చిపోయాను..నీ మాటల తూటాలకు పూర్తిగా శవంగా మారాను