కమ్మని కలవై నను చేరిన నేస్తమా
పొమ్మని అనకు నన్ను ఈసారికి క్షమించుమా
నన్ను దాచుకున్న నీ మనసుని నొప్పించాను
నిన్ను దాచుకున్న నా మనసుని ద్వేశించాను
నీ ప్రతి కల నా కోసమని
నీ ప్రతి అడుగు నాతొ అని గుర్తించలేని గుడ్డివాడినయ్యాను
నీ కున్న ఆశ నేనేనని
నా ప్రతి శ్వాస నువ్వేనని తెలిసి తెన్చుకోవాలనుకున్నాను
కాని నేడు తెలిసింది నువ్వు లేని లోటు ,,,
కమ్మని కలవై నిదురించిన నీవు చెంత లేక
నిదురన్నదే కల అయినది ,
ప్రతి కలలో నను లాలించే నీవు
నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది ,
అడుగున అడుగై నను నడిపించిన నీవు లేక
ప్రతి అడుగు తడబడుతుంది
ఇక నీవు లేక నేను జీవించలేను
ఈసారికి క్షమించుమా