అనుబంధాల బంధాలకు
ఆత్మియతాను రాగాలకు లొంగే
అతి మాములు మనిషి నేను
ఒకడు యోగి అయితే మరొకడు భోగి
ఒకడు సాధువు అయితే మరొకడు సాడిశ్టు
ఒకడు అపరాధి మరొకడు నిరపరాధి
అపరాధి చేసే తప్పులకు
నిరపరాధి బలౌతాడు
నిరపరాధి నేను Accomplice కాదు
విరుద్ధంగా సా క్షం చెప్పే Approver కాదు
మౌనంగా చూస్తూ నిలబాడే Silent Witness మాత్రమే
తప్పు చేసిన వాడు ఏప్పుడూ విజేతే
ఎప్పుడు తప్పించుకొనే తిరుగుతాడు..
వాడెప్పుడూ హేపేగా నే ఉంటాడు..
తనకు కావల్సింది ఏదోరకంగా సాదించుకుంటాడు
ఎటొచ్చీ శిక్ష పడేధి ఏ తప్పుచేయని నాకే
ఏ నేను నేనో నాకు తెలిసిన నాడు
నాలో నేను ఎప్పుడో చచ్చిపోయాను
కాదు నీవే దారుణంగా చంపేశావు..
నివునా మోసం చేసి చంపేసావు
నాలోని ఈ అలజడులకు ఆలోచలనలకు అంతం లేదు