Wednesday, August 17, 2011
ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.
ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.
ఎన్ని రోజులైంది నిన్ను చూసి అందుకే వెతుకుతున్నా..
ఎక్కడన్నా వని వెతకను...అన్ని చోట్ల్ వెతుకుతున్నా..
నీకు పుస్తకాలు చదవడం ఇష్ట అని బుష్టాల్స్ లో వెతికా ..
సాయంత్రం ప్రెండ్స్ తో సరదాగా పార్కుకెలతావని అక్కడా వెతికా..
ఇల అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్ల్ వెతికా..
వెతికి వెతికి అలసిపోయి..రాత్రి నిద్రపొదామని ట్రైచేశా..
ఎందుకో నిద్దుర పట్టలేను..బలవంతంగా నిద్రపోవాలని ట్రైచేశా..
నీజ్ఞాపకాలు నాకు నిద్దుర లేకుండా చేస్తున్నాయి..
కళ్ళల్లో కన్నీళ్ళు గుండేళ్ళో ఆవేదన తప్ప నీవు కానరావడం లేదు..
గతంలో మనం కల్సిన కాలం తిరిగిరాదని తెల్సింది..
నీవన్నది నిజం నేనన్నది అబద్దం అంటూ నీకోసం పరుగులు తీస్తున్నా..
అక్కడా ఇక్కడా వెతికి అలసి పోయిననాకు అప్పుడు తెల్సింది అసలు నిజం
చివరికి నాగుండెళ్ళో హాయిగా నిద్దురపోతూకనిపించావు ప్రియా
Labels:
కవితలు