నీకై వేచిన క్షణాలు నీవున్నా చెప్పలేనులే,
నీవు లేని క్షణాలు నీనున్నా వ్యర్దమేనులే,
నిన్ను కలిసిన క్షణాలు నా మరుజన్మకు జ్ఞాపకాలులే,
ఎప్పటికి నీకై, కవ్యగీతమై కన్నీరు కారుస్తాను.........
ఆ కన్నీటి సాక్షిగా నీ స్పర్శకై తపిస్తాను........
నా తపనకు రూపాలు.. నీ అడుగులు....
నీ అడుగుల నీడకు నా నయనాలు దీపాలు.....
వరమై వచ్చి ఎదురయ్యావు....!!
రాగమై వచ్చి స్వరమయ్యావు..!!
వరం వరదై, రాగం రోదనై....నీవు శిలవయ్యావు.................!!
ఇప్పటికి, ఎప్పటికి...
ఈ శిల నిదురించే చినుకై నీలోనే దాగుంది...................!!